ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధన్‌ డివిజన్‌లో కరోనా ఆంక్షలు

ABN, First Publish Date - 2021-04-13T06:10:40+05:30

: బోధన్‌ డివిజన్‌ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు ఆంక్షలు విధించారు. వారం రోజులుగా కేసులు పెరుగు తుండడం.. డివిజన్‌ మహారాష్ట్రకు సరిహద్దున ఉండడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు మండలాల్లో కట్టడి ప్రాంతాలు

అమ్దాపూర్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు

వారాంతపు సంతలకు ఆంక్షలు

బోధన్‌, ఏప్రిల్‌  12 : బోధన్‌ డివిజన్‌ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు ఆంక్షలు విధించారు. వారం రోజులుగా కేసులు పెరుగు తుండడం.. డివిజన్‌ మహారాష్ట్రకు సరిహద్దున ఉండడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు నాలు గు మండలాల్లో కట్టడి ప్రాంతాలను గుర్తించారు. వర్ని మండలం సిద్దాపూర్‌, రెంజల్‌ మండలం పేపర్‌మిల్‌, వీరన్నగుట్ట, బోధన్‌ మండలం సాలూరక్యాంప్‌, కోటగిరి మండలం సుంకిని గ్రామాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల కరోనా పాజిటివ్‌ రోగుల కోసం బోధన్‌ మండలం అ మ్దాపూర్‌ శివారులో క్వారంటైన్‌ కేంద్రాన్ని ప్రారం భిం చారు. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. రెంజల్‌ మండలం సాటా పూ ర్‌, బోధన్‌, కోటగిరి మండలం పోతంగల్‌ సంతలపై ఆం క్షలు పెట్టారు. సంతల్లో మాస్క్‌లు తప్పనిసరి కావ డం తోపాటు సంతలను ఊరి బయట బహిరంగ ప్రదే శంలో ఏర్పాటుచేసుకునేలా ఆంక్షలు పెట్టారు. ప్రధా నంగా మ హారాష్ట్ర నుంచి అధికశాతం జనం వచ్చే సాటా పూర్‌ సంత, పోతంగల్‌ సంతలపై ఆంక్షలు ఉంటాయని ప్రక టించారు. కల్లుపాకలలో అక్కడే కూర్చోకుండా ఇంటికి తీసుకెళ్లి తాగేలా, వైన్స్‌ల వద్ద క్యూ పద్ధతిలో పాటించేలా ఆంక్షలు పెట్టారు. బోధన్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కరో నా చికిత్సలు అందించేలా ఏర్పాట్లుచేశారు. బోధన్‌ లోని దాదాపు 5పైనే ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ రోగు లకు చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-13T06:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising