ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ కమిషనర్‌

ABN, First Publish Date - 2021-12-08T05:25:25+05:30

కామారెడ్డి ప్రభుత్వ డి గ్రీ కళాశాలను మంగళవారం రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తనిఖీ చేశారు.

రాశీవనంలో మొక్కను నాటుతున్న విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 7: కామారెడ్డి ప్రభుత్వ డి గ్రీ కళాశాలను మంగళవారం రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో రూసా నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. పాత భవనాన్ని పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పం పించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్‌ కళాశాల భవనం పరిశీలించి అందులో బాలుర వసతి గృహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన ంత రం ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో సమావేశం నిర్వహించిన కళాశాల అడ్మిషన్స్‌ పెంచడానికి కృషి చేయాలని తెలిపారు. న్యాక్‌ గుర్తింపు కోసం వెళ్తున్న సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు న్యాక్‌లో మంచి గ్రేడ్‌ సాధించి అటానమస్‌ కోసం ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రభుత్వ కళాశాల భూముల విషయానికి సంబంధించి కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ విషయమై ఈ వారంలోనే  సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో కలిసి కళాశాల రాశీవనంలో మామిడి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌, అధ్యాపకులు రాణి, శంకర్‌, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రామస్వామి, శివకుమార్‌, శరత్‌రెడ్డి, గణేష్‌, సూచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising