ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీర్కూర్‌ ప్రాథమిక పాఠశాలలో నమూనాల సేకరణ

ABN, First Publish Date - 2021-10-29T05:22:40+05:30

మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

బీర్కూర్‌ ప్రాథమిక పాఠశాలలో నమూనాలను సేకరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీర్కూర్‌, అక్టోబరు 28: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, గురువారం జిల్లా ఆహార నాణ్యత ప్రమాణాల అధికారిణి స్వాతి బీర్కూర్‌ మండల కేంద్రానికి విచ్చేసి పాఠశాలను తనిఖీ చేసి, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి అందించే ఆహార సరు కులను, శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఆహార నాణ్య త ప్రమాణాల అధికారిణి మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణం ఏమిటనేది తెలుసుకోవడం కోసం పాఠశాల ల్లోని సరుకుల శాంపిళ్లను సేకరించారు. అలాగే ఈ సరుకులను ఏ కిరాణ షాపుల నుంచి తీసుకుని వస్తున్నారో ఆ కిరాణ షాపుకు వెళ్లి శాంపిళ్ల ను సేకరించినట్లు తెలిపారు. ఈ శాంపిళ్లను ల్యాబ్‌కు పంపి స్తామని, 15 రోజుల అనంతరం పూర్తి రిపోర్టు వస్తుందని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట డీఈవో రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప తదితరులున్నారు.   
కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డీఈవో
మండల కేంద్రంలోని గడి కింద గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశా లలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, డీఈవో రాజు, జిల్లా సెక్టోరియల్‌ అధికారి గంగాకిషన్‌లు ప్రాథమిక పాఠశాలను, కస్తూర్బా పాఠశాలను తనిఖీలు చేశారు. ప్రాథమిక పాఠ శాల, కస్తూర్బా పాఠశాలలో గల సరుకులను వారు పరిశీలించారు. భోజనానికి వినియోగించే సరుకులు నాణ్యంగా ఉన్నాయా లేదా అనే దానిపై వారు ఆరా తీశారు. కస్తూర్బా పాఠశాలలో సరుకులకు సంబం ధించిన స్టాక్‌ రిజిష్టర్లను సైతం వారు పరిశీలించారు. డీఈవో, సెక్టోరి యల్‌ ఆఫీసర్లు మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం, నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. వారి వెంట ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌ తదితరులున్నారు.  
విద్యార్థులంతా సేఫ్‌..
మండల కేంద్రంలోని గడి కింద గల ప్రాథమిక పాఠశాలలో మధ్యా హ్న భోజనం వికటించి 172 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. అయితే, 113 మంది విద్యార్థులను అంబులెన్స్‌, ఇతర వాహ నాల్లో బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. మరో 59 మంది విద్యార్థులకు బీర్కూర్‌ పీహెచ్‌సీలో మండల వైద్యా ధికారి రాజా రమేష్‌ వైద్యసేవలు అందించారు. గురువారం 111 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి బీర్కూర్‌కు తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులకు సాయంత్రం వరకు చికిత్స చేసి డిశార్జ్‌ చేయనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. మొత్తం మీద విద్యార్థులంతా సేఫ్‌గా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-29T05:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising