ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

ABN, First Publish Date - 2021-06-21T06:54:13+05:30

నేరాలను నియంత్రించడంతో పాటు నేరాలు చేసినవారిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తాయని నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఏసీపీ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 20: నేరాలను నియంత్రించడంతో పాటు నేరాలు చేసినవారిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తాయని నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రతీ గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లతోపాటు వాణిజ్య, వ్యాపార స్థలాల్లో, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. కేశాపూర్‌ గ్రామంలో తరచూ దొంగతనా లు, గుళ్లలో దోపిడీలు గతంలో జరిగాయని, అయితే నేరస్థులు మాత్రం తప్పించుకోగలిగారని, వారిని పట్టుకునేందుకు ఎంతో సమయం పట్టిందని గుర్తుచేశారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పందంగా సంచరించి నా, అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు లేదా 100 నెంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సౌత్‌ జోన్‌ సీఐ రవి, రూరల్‌ ఎస్‌హెచ్‌వో లింబాద్రి, గ్రామపెద్దలు మహేందర్‌, లింగారెడ్డి, ఒడ్డెన్న, లలిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T06:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising