ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాచాపూర్‌లో కుల బహిష్కరణ?

ABN, First Publish Date - 2021-04-23T05:16:33+05:30

రజక కులానికి చెందిన ఓ కు టుంబాన్ని సదరు కులస్థులే కుల బహిష్కరణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భిక్కనూరు, ఏప్రిల్‌ 22: రజక కులానికి చెందిన ఓ కు టుంబాన్ని సదరు కులస్థులే కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన భిక్కనూరు మండల కాచాపూర్‌ గ్రామంలో చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమని బుచ్చవ్వ, యాదయ్య దంపతులు. కొన్నిరోజుల క్రితం యాదయ్య మృతిచెందాడు. కానీ అంతక్రియలకు రజక కులస్థులు ఎ వరూ హాజరుకాలేదు. దీంతో బాధితులు భిక్కనూరు ఎస్సై నవీన్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమను కుల బహిష్కరణ చేశారని, మామ యాదయ్య అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో కోడలు అవంతి మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్న ట్లు ఎస్సై తెలిపారు. విచారణ చేపడుతామని, కుల బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలి పారు. కానీ తాము కులబహిష్కరణ చేయలేదని, కరోనా ప్రభలుతుండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేదని రజక సంఘం కుల పెద్దలు చెప్పడం గమనార్హం.

Updated Date - 2021-04-23T05:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising