ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ABN, First Publish Date - 2021-04-14T06:09:06+05:30

మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండ్రశోభ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందల్‌వాయి, ఏప్రిల్‌ 13: మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండ్రశోభ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వంట సామగ్రితో పాటు రూ.70వేల నగదు, తులం బంగారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. ఉగాది రోజు పిండి వంటలు చేసేందుకు సామగ్రి తీ సుకువచ్చేందుకు బయటకి వెళ్లగా తిరిగి వచ్చేసరికి షార్ట్‌ సర్క్యూట్‌తో మం టలు చెలరేగాయి. గ్రామస్థుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ బాధితురాలికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశా రు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ నరేష్‌, ఎంపీటీసీ బాబురావు రూ.5వేల బియ్యం అందజేశారు. 


Updated Date - 2021-04-14T06:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising