ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో బాలింత మృతి

ABN, First Publish Date - 2021-05-14T05:30:00+05:30

కరోనా మహమ్మారి తొమ్మిది రోజుల బాలింతను బలితీసుకుంది. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి యువకుడికి ఏడాదిన్నర క్రితం డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన యువతి(22)తో వివాహమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందల్‌వాయి, మే 14: కరోనా మహమ్మారి తొమ్మిది రోజుల బాలింతను బలితీసుకుంది. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి యువకుడికి ఏడాదిన్నర క్రితం డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన యువతి(22)తో వివాహమైంది. ఇటీవల తొమ్మిది నెలల గర్భిణి అయిన సదరు యువతిని పురుడు పోసుకునేందుకు నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌ ఉందని తెలిపారు. దీంతో పాటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చిందని హైదరాబాద్‌లోని నవోదయ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. కుటుంబ స భ్యులు ఆమెను హైదరాబాద్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. 9 రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. కరోనాతో పోరాడుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలిపారు. 9 రోజుల పసికందును, బాలింత మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి భర్త పసికందును పట్టుకుని గుండెలవిసేలా రోదించాడు. ఈ ఘటన చూసి అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. 

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising