ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-04-10T04:41:11+05:30

కొవిడ్‌ సెకండ్‌ వె వ్‌, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కామారెడ్డి, నిజామాబాద్‌ కలె క్టర్లకు, జనరల్‌ ఆసుపత్రుల సూపరింటెండె ంట్‌లతో శుక్రవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవ నాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ప్రశాంత్‌రెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్‌ 9: కొవిడ్‌ సెకండ్‌ వె వ్‌, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కామారెడ్డి, నిజామాబాద్‌ కలె క్టర్లకు, జనరల్‌ ఆసుపత్రుల సూపరింటెండె ంట్‌లతో శుక్రవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవ నాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపఽథ్యంలో తీసుకోవల సిన జగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నిజామా బాద్‌ జిల్లాలోని బోధన్‌ ఆర్మూర్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉభయ జిల్లా ల కలెక్టర్లు శరత్‌, నారాయణరెడ్డిలను మంత్రి ఆదేశించారు. మఖ్యంగా రోగికి అవసరమయ్యే ట్రీట్‌మెంట్‌ను బట్టి ముందు ఏరియా ఆసుపత్రిలో చూడాలని అత్యవసరమైతేనే జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని సూచించారు. ఏయో పేషెంట్‌కు ఎక్కడ చికిత్స అందించాలో ముందే అవగాహన వచ్చేలా ఒక ప్రొటోకాల్‌ పాటించాలని చెప్పారు. నిజామా బాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జనరల్‌ ఓపీని తగ్గించి కొవిడ్‌ పేషెం ట్లకు చికిత్సకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కరోనా టెస్టు ల సంఖ్య పెంచాలని అదేవిధంగా సమాంతరంగా కొవిడ్‌ వ్యాక్సిలేషన్‌ జరిగేలా చూడాలని ఇరు జిల్లాల కలెక్టర్లను ఆదే శించారు. ఆర్థిక స్తోమత కలిగి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలనుకునే వారికి ఆ వెసులు బాటు కల్పించాలన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేయవద్దని, బిల్లులు ఎక్కువ వేస్తే ప్రభుత్వం దృష్టికి  వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీజీహెచ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉందని సూపరింటెండెంట్‌ ప్రథిమారాజ్‌ మంత్రి దృష్టికి తీసుకురా గా తాత్కాలికంగా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించుకునే అధికారాలను సూపరింటెండెంట్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి సూచించారు. కరోనా ప్రబలుతున్న దృష్యా అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు కూడా విధిగా స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని మంత్రి కామా రెడ్డ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రజలకు కోరారు.

Updated Date - 2021-04-10T04:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising