పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ABN, First Publish Date - 2021-10-22T05:19:35+05:30
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్, అక్టోబరు 21: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యా అధికారులు, ఇంటర్మీయట్ విద్యా కమిషనర్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి డీఐఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో 71 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కేంద్రాల నిర్వహణ సామగ్రి సమకూర్చుకోవడం, కొవిడ్ నిబంధనలు, శానిటైజర్, మంచినీటి వసతి, పరీక్ష కేంద్రాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సెట్-ఏ ప్రశ్నాపత్రాల పంపిణీ పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ ప్రశశ్న పత్రాలను పోలీసు స్టేషన్‌లలో భద్రపరచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణాధికారి రవికుమార్, విద్యాశాఖ ఏసీ విజయ్‌భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:19:35+05:30 IST