ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌లో విద్యకు 20 శాతం నిధులను కేటాయించాలి

ABN, First Publish Date - 2021-12-06T06:30:11+05:30

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యపై 20శాతం నిధులను కేటాయించాలని రిటైర్డ్‌ ఐఏ ఎస్‌, ఎస్‌డీఎఫ్‌(సోషల్‌ డెమెక్రటిక్‌ ఫోరం) ప్రతినిధి ఆకు నూరి మురళి అన్నారు.

కామారెడ్డి ఎస్సీ వాడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద మాట్లాడుతున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం  బడ్జెట్‌లో విద్యపై 20శాతం నిధులను కేటాయించాలని రిటైర్డ్‌ ఐఏ ఎస్‌, ఎస్‌డీఎఫ్‌(సోషల్‌ డెమెక్రటిక్‌ ఫోరం) ప్రతినిధి ఆకు నూరి మురళి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ఎస్పీవాడ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 20 శాతం నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలుగా ఉండగా 22 జిల్లాలకు ఇన్‌చార్జీ డీఈవోలు ఉన్నారని మండల విద్యాశాఖ అధికారుల పోస్ట్‌ లు కూడా ఖాళీగానే ఉన్నాయన్నారు. ఇన్‌చార్జీలతో కాలం వెల్లదీస్తున్నారని దీంతో పాఠశాలలపై మానిటరింగ్‌ వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గద్దెను ఎక్కిన తర్వాత మరిచిపోయి ందని అన్నారు. ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా కనీస మౌలిక వసతులు లేకుండా ఉన్నాయని తెలిపారు. పాఠశాల నిర్వహణను గ్రామ పంచాయతీ, మున్సిపల్‌కు అప్పగించడం వల్ల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని తెలిపారు. ప్రభు త్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు సమకూర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని అన్నారు. గత రెండు రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో మన ధనిక రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో వివరించామన్నారు. ఉపాధ్యాయుల కొరతతో పాటు మౌలిక వసతులు, శిథిలావస్థలో ఉన్న భవనాలను, మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతులు బృం దం సభ్యులు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీఎఫ్‌ ప్రతినిధులు ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, శంకర్‌, రజిత, ప్రణతి, శుభశ్రీ, ప్రకాష్‌, ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T06:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising