ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 13 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ABN, First Publish Date - 2021-11-19T00:26:49+05:30

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 13 ప్రదేశాల్లో సోదాలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 13 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఇళ్లలో ఉన్న సెల్‌ఫోన్స్‌, పుస్తకాలు, హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్, నాగోల్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి. బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు. అపార్ట్‌మెంట్‌లో ఓయూ విద్యార్థులు ఉంటున్నారని సమాచారంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. నారాయణగూడలోని అంబికా టవర్స్‌లో లేడీస్ హాస్టల్‌లోనూ సోదాలు చేశారు.


నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అల్వాల్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న.. అమరుల బంధుమిత్రుల సంఘం నేత పద్మ కుమారి, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. పద్మను పోలీసులు విచారిస్తుండగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పుస్తకాలు, వస్తువులను పోలీసులు చిందరవందరగా పడేశారు.

Updated Date - 2021-11-19T00:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising