ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోదాలపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన

ABN, First Publish Date - 2021-11-19T02:10:33+05:30

రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలలో ఉదయం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలలో ఉదయం నుంచి చేసిన సోదాలపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు  ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహించిది.  2019 జూన్‌లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని తెలిపింది. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్ట్‌లతో పాటు ఒక పౌరుడు హతమయ్యారు.


ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బస్తర్‌‌లో జూన్ 2019లో ఎఫ్ఐఆర్  నమోదయింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా 2021 మార్చిలో కేసును ఎన్ఐఏ టేకప్ చేసింది. సంజు, లక్ష్మణ్, మున్ని, దాషరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎన్ఐఏ చేర్చింది. ఈరోజు ఉదయం నుంచి సోదాలను ఎన్ఐఏ నిర్వహించింది. ఈ సోదాల్లో ఎలాక్రానిక్ పరికరాలు, అనుమనాస్పద మెటీరియల్, మావోయిస్ట్ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 




Updated Date - 2021-11-19T02:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising