ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ టీడీపీకి కొత్త బాస్

ABN, First Publish Date - 2021-07-19T16:54:14+05:30

లంగాణ టీడీపీకి కొత్త బాస్ వచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి కొత్త బాస్ వచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్‌గౌడ్‌ పేరును ముందగా పరిశీలించారు. ఒకదశలో పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేరు చర్చకు రాగా, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన ఆసక్తి చూపలేదు. బాధ్యతలు స్వీకరించడానికి రావుల నిరాకరించిండంతో బక్కని నరసింహులు వైపు నాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నర్సింహులును అభినందించిన లోకేష్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరారు.



Updated Date - 2021-07-19T16:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising