ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ నూతన చట్టాలు రైతుల పాలిట శాపాలు: ఆర్‌.నారాయణమూర్తి

ABN, First Publish Date - 2021-08-30T01:00:34+05:30

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణలు రైతుల పాలిట శాపాలుగా మారాయని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణలు రైతుల పాలిట శాపాలుగా మారాయని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నూతన చట్టాలు, సంస్కరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టాలు, సంస్కరణల రద్దుపై ఎనిమిది నెలలుగా రైతులు అమోఘమైన పోరాటం చేస్తున్నా సమస్య మాత్రం ఓ కొలిక్కి రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే దాదాపుగా 600మంది రైతులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, దీనికి పరిష్కారం కావాలన్న దానిపై తీసిందే ‘రైతన్న’ సినిమా అన్నారు. 2006కు ముందు దేశంలో 3.50లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్‌ దేశమంతటా తిరిగి రైతులు, వినియోగదారులు, ఆర్థిక శాస్త్రవేత్తలను కలిసి ఒక గొప్ప రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. రైతు పండించే పంటకు పెట్టే పెట్టుబడి, శ్రమ, కుటుంబ శ్రమ, కౌలు, వడ్డీ అన్నీ పోనూ అదనంగా 50శాతం లాభం ఇవ్వాలని నివేదికలో సూచించిందని నారాయణమూర్తి గుర్తుచేశారు.

Updated Date - 2021-08-30T01:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising