ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల సందర్శన.. ప్రకృతి అందాల వీక్షణ

ABN, First Publish Date - 2021-07-18T09:24:34+05:30

రాష్ట్రంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితమైన కుటుంబాలు ఆట విడుపు కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విహార యాత్రలకు పర్యాటకుల ఉత్సాహం.. 
  • కరోనా కారణంగా స్థానిక ప్రాంతాలకే ప్రయాణం
  • పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితమైన కుటుంబాలు ఆట విడుపు కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నాయి. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవడమెందుకని.. స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించడానికి, ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఔత్సాహికుల కోసం వారాంతపు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్‌లకు ఏర్పాటు చేస్తోంది. పర్యాటకుల సంఖ్యను బట్టి బస్సులను సిద్ధం చేసి.. టూర్‌లకు తీసుకెళ్తుంది. తక్కువలో తక్కువ ఆరుగురు పర్యాటకులు టూర్‌కు సిద్ధమైతే.. వారి కోసం ఏర్పాట్లు చేయనుంది. మొత్తంగా 29 బస్సులను పర్యాటక సంస్థ అందుబాటులో ఉంచింది. హైదరాబాద్‌ నుంచి వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన హరిత హోటళ్లను కూడా సందర్శకుల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది.


కొండపోచమ్మ రిజర్వాయర్‌ 

హైదరాబాద్‌ నగరం నుంచి ఉదయం పర్యాటక సంస్థ బస్సులో బయలుదేరి కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేరుకుని అక్కడి నుంచి కొమురవెల్లి  వెళ్లి అక్కడ మల్లన్న ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుని దర్శనం అనంతరం సాయంత్రం 5గంటల వరకు కొండగట్టు వెళ్లి ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.




కాళేశ్వరం

కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రత్యేక టూర్‌ను పర్యాటక సంస్థ ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీలో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు (సిద్దిపేట సమీపం), సుందిళ్ల బ్యారేజ్‌ (మంథని సమీపం), అన్నారం పంప్‌ హౌజ్‌లను సందర్శించవచ్చు. బాసర టూర్‌లో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, గోదావరి నదితో పాటు డిచ్‌పల్లి, రామాలయం, అలీసాగర్‌ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, రఘునాథ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇంకా వేర్వేరుగా నాగార్జున సాగర్‌, సోమశిల, ఆలంపూర్‌, వికారాబాద్‌, ఖిలా వరంగల్‌, హన్మకొండ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం, బొగత జలపాతం, వికారాబాద్‌, అనంతగిరి కొండలు. అనంతపద్మనాభ స్వామి ఆలయం, అటవీ క్షేత్రంలో పర్యటన కోసం ప్రత్యేక ప్యాకేజీని పర్యాటక సంస్థ ఏర్పాటు చేసింది. 


కనీసం 6గురు పర్యాటకులు ఉంటే చాలు.. ప్యాకేజీ 

కనీసం ఆరుగురు పర్యాటకుల బృందం అందుబాటులో ఉన్నపక్షంలో వారు కోరుకున్న టూర్‌కు పంపించేందుకు పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసింది. అలాగే 10 మందికి, 10 నుంచి 15 మందికి, 15నుంచి 20 మందికి, 20 నుంచి 26 మందికి, 26నుంచి 36 మందికి ప్రత్యేకంగా ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలకు బషీర్‌బాగ్‌లోని పర్యాటక సంస్థ సెంట్రల్‌ రిజర్వేషన్‌ కేంద్రాన్ని సంప్రదించవచ్చని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ తెలిసారు. ఫోన్‌ నెంబర్‌ 9848802252లో అధికారులను సంప్రదించి టూర్‌ ప్యాకేజీ చార్జీలు, రాయితీ వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.




శ్రీశైలం 

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తుల కోసం పర్యాటక సంస్థ రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది. నగరం నుంచి బయలుదేరి శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి ఆలయ దర్శనం, అనంతరం పాతాళగంగ - పాలధార పంచదారి, శిఖర దర్శనం, సాక్షిగణపతి దర్శనం చేసుకుని మరుసటి రోజు హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. 




యాదాద్రి 

హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి వెళ్లే దారిలోని ప్రధాన క్షేత్రాలను సందర్శించవచ్చు. బషీర్‌బాగ్‌ నుంచి ఉదయం బస్సులో బయలుదేరితే మార్గమధ్యలోని కొలనుపాక జైన మందిరం, యాదగిరిగుట్ట లోటస్‌ టెంపుల్‌ను దర్శించుకోవచ్చు అనంతరం హరిత హోటల్‌లో భోజనం చేసి సాయం త్రం 4గంటల వరకు లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయాన్ని సందర్శించి తదుపరి కళాధామం (సురేంద్రపురి) చూసిన తర్వాత రాత్రి వరకు నగరానికి చేరుకోవచ్చు.




పర్యాటక రంగానికి ప్రాధాన్యం 

పర్యాటక రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోందని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తెలిపారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితమైన అనేక కుటుంబాలు విహార యాత్రలకు వెళ్లి రావడానికి అనువుగా తాము ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను రూపొందించినట్టు పేర్కొన్నారు. అన్ని సందర్శన కేంద్రాలు, కేంద్రాలకు సమీపంలోనూ అన్ని వసతి సౌకర్యాలతో హరిత హోటళ్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. కొవిడ్‌ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడని పర్యాటకుల కోసం స్థానికంగా ఉన్న పర్యాటక స్థలాను సందర్శించడానికి ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తున్నట్టు తెలిపారు.  

- రాష్ట్రపర్యాటక అబివృద్ధి సంస్థ చైర్మన్‌ 

ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా


Updated Date - 2021-07-18T09:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising