ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముక్కు ద్వారా టీకా’ ట్రయల్స్‌ షురూ!

ABN, First Publish Date - 2021-03-06T08:49:32+05:30

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ఇంట్రా నాజల్‌ (ముక్కు ద్వారా తీసుకునే) టీకా తొలిదశ ట్రయల్స్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హైదరాబాద్‌లో ఇద్దరు వలంటీర్లకు 
  • 175 మందిపై  ఫేజ్‌-1 ట్రయల్స్‌

హైదరాబాద్‌, మార్చి 5: భారత్‌ బయోటెక్‌  రూపొందించిన ఇంట్రా నాజల్‌ (ముక్కు ద్వారా తీసుకునే) టీకా తొలిదశ ట్రయల్స్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. దీంతోపాటు చెన్నై, పట్నా, నాగ్‌పూర్‌లోనూ మొత్తం 175 మందిపై ట్రయల్స్‌ నిర్వహించడానికి ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఎంపిక చేసిన పది మంది వలంటీర్లలో ఇద్దరికి.. ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఈ టీకా ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులూ లేవని వైద్యులు తెలిపారు. కాగా.. భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మాడిసన్‌ వైరాలజిస్టులతో, ఫ్లూజెన్‌ అనే టీకా తయారీ కంపెనీతో కలిసి అభివృద్ధి చేసింది. విస్కాన్సిన్‌ మాడిసన్‌ వర్సిటీ వైరాలజిస్టులు, ఫ్లూజెన్‌ కలిసి.. ఫ్లూ నివారణ కోసం గతంలో ‘ఎం2ఎ్‌సఆర్‌’ అనే ఇంట్రా నేజల్‌ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశారు. అదే ‘ఎం2ఎ్‌సఆర్‌’లో కరోనా వైరస్‌ జన్యుక్రమాలను కూడా చొప్పించడం ద్వారా ఈ కొత్త వ్యాక్సిన్‌ (ఇంట్రా నేజల్‌) తయారుచేశారు. ఈ వ్యాక్సిన్‌ కరోనాను సమర్థంగా నియంత్రిస్తుందని భారత్‌ బయోటెక్‌ చెబుతోంది. 

Updated Date - 2021-03-06T08:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising