ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి : బండా

ABN, First Publish Date - 2021-03-24T06:27:31+05:30

రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, మార్చి 23 : రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళాప్రాంగణంలో జీవ వైవిద్యం, సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. విపరీతమైన మందుల వాడకంతో పండించిన పంటలు మానవ మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. సేంద్రియ ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచి సాగు విస్తరించాలన్నారు. ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని, సేంద్రియ వ్యవసాయం చేసేవారిని గుర్తించి సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయనిదే పెద్దఎత్తున స్థానం కానుందన్నారు. జేడీఏ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వల్ల దిగుబడులు అధికంగా వచ్చినా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతారని కావున  సేంద్రియ ఎరువులను వాడాలని కోరారు. సదస్సులో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. సదస్సులో జీవవైవిధ్య కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శిల్పిశర్మ, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో జి.కాంతమ్మ, సంగీతలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising