ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108కు ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అరగంట వెయిటింగ్.. అంబులెన్స్‌ రాకపోవడంతో...!

ABN, First Publish Date - 2021-11-04T18:41:59+05:30

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజప్రస్థానం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మర్రిగూడ సమీపంలో ఉన్న క్యాంప్‌లో బస చేస్తున్నారు. అయితే క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు. ఈ విషయం షర్మిల దృష్టికి వచ్చింది. వెంటనే స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. హుటాహుటిన తన కాన్వాయ్‌లోని అంబెలెన్స్‌‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.


ఈ విధంగా  క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా షర్మిల తన వంతు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 108 సేవలు ఎలా ఉన్నాయో ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుసుకోవచ్చన్నారు. అసలు 108 అంబులెన్స్ సర్వీసులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు. 108 సేవలను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-04T18:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising