ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమికుడి వంచనకు యువతి బలి

ABN, First Publish Date - 2021-06-23T07:31:26+05:30

వారిద్దరూ సమీ ప బంధువులు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు. కట్నం కోసం ఆశపడిన యువకుడు వేరే యువతితో నిశ్చితార్ధం చేసుకోవడంతో మనస్తాపం చెందిన ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుంది.

ఉమ(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల జూన్‌ 22: వారిద్దరూ సమీ ప బంధువులు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు. కట్నం కోసం ఆశపడిన యువకుడు వేరే  యువతితో నిశ్చితార్ధం చేసుకోవడంతో మనస్తాపం చెందిన ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం  ముకుం దాపురం గ్రామానికి చెందిన గాడ్దుల రామ చంద్రు, లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమా ర్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  వీరి నాలుగవ కుమార్తె ఉమ(22), సమీప బంధువైన అదే గ్రామా నికి నర్సింగ్‌ ఉమేష్‌  సూర్యాపేటలో ఇంటర్మీడియట్‌ చదివారు. ఈ సమ యంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో దిల్‌ సుఖ్‌నగర్‌లో తమ్ముడితో కలిసి గది అద్దెకు తీసుకుని ఉమ ఉంటూ  బీఫార్మసీ పూర్తి చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామం రాగా, ఉమేష్‌కు వేరే సంబంధం కుదిరినట్లు తెలుసుకుంది. దీంతో మన స్తాపం చెందిన ఉమ ఉద్యోగం చూసుకుంటానని ఇంట్లో చెప్పి సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. మంగళవారం ఉదయం గది తలుపు తీయకపోవడంతో ఇంటి యజమాని  కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.  ఇంటి యజమాని  ఉమ  తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ఉమ మృతదేహాన్ని తీసుకురావడానికి బంధువులు హైదరాబాద్‌ వెళ్లారు. 

చివ్వెంల మండలంలో యువకుడు ఆత్మహత్య 

చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెంది న పొదిల శ్రీను–నర్మద దంపతుల కుమారుడు వేణు(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో  మంగళవారం మధ్యాహ్నం  ఆత్మహత్య చేసుకు న్నాడు.  అక్కడే ఆడుకుంటున్న పిల్లలు చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు.  వేణు చిన్నతనంలోనే తండ్రి శ్రీను మృతి చెందాడు. ఇటీవల సోదరి పెళ్లయింది.  తల్లి కాయ కష్టం చేసి ఇద్దరు పిల్లలను పోషించింది.  కారణం తెలియకుండా కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి నర్మద రోదిస్తున్న తీరు అందరినీ కలిచి వేసింది. వేణు మృతదేహనికి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, రామగిరి నగేష్‌, పెద్దగట్టు ఆలయ డైరక్టర్‌ నల్లబోతు నాగరాజులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.




Updated Date - 2021-06-23T07:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising