ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పస్తులుంచి పని చేయించారు

ABN, First Publish Date - 2021-07-27T07:04:34+05:30

కనగల్‌ మండలంలోని జీఎడవల్లి గ్రామ శివారులో బృహత్‌ పల్లెప్రకృతి వనానికి కేటాయించిన స్థలంలో గుంతలు తీసి మొక్కలను నాటేందుకు మండలంలోని 32 గ్రామపంచా యతీలకు చెందిన సుమారు 2వందల మంది జీపీ వర్కర్స్‌ను అధికారులు సోమవారం అఽక్కడికి నిబందనలకు విరుద్దంగా తరలించారు.

మొక్కలు నాటుతున్న పంచాయతీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

నల్లగొండ/ నల్లగొండక్రైం, జూలై  26: కనగల్‌ మండలంలోని జీఎడవల్లి గ్రామ శివారులో బృహత్‌ పల్లెప్రకృతి వనానికి కేటాయించిన స్థలంలో గుంతలు తీసి మొక్కలను నాటేందుకు మండలంలోని 32 గ్రామపంచా యతీలకు చెందిన సుమారు 2వందల మంది జీపీ వర్కర్స్‌ను అధికారులు సోమవారం అఽక్కడికి  నిబందనలకు విరుద్దంగా తరలించారు. రోజంతా మొక్కలు నాటే పని ఉంటుందని, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తామని సదరు జీపీవర్కర్స్‌కు అధికారులు తెలిపారు. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు అక్కడ చేయలేదు. 200మంది వర్కర్స్‌కు గాను 70 మందికి సరిపోయే భోజనాన్ని సిద్ధం చేశారు.కొంతమంది అర్ధాకలితో భోజనాన్ని ముగించు కోగా చాలామది ఆకలికి తట్టుకోలేక పని ప్రదేశం నుంచి ఇంటికి తిరిగి వెళ్లారు. చాలీచాలని భోజన ఏర్పాట్ల గురించి ప్రశ్నించగా స్థానిక కార్యదర్శి దూషించారని వర్కర్స్‌ వాపోయారు. కాగా జరిగిన పనులకు ఉపాధిహామీ కూలీల పేరుమీద బిల్లులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపించారు.

Updated Date - 2021-07-27T07:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising