మహిళ అనుమానాస్పద మృతి
ABN, First Publish Date - 2021-06-28T07:46:42+05:30
మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
మహిళ అనుమానాస్పద మృతి
భూదాన్‌పోచంపల్లి, జూన్ 27: మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం ముద్దపురం గ్రామానికి చెందిన పిన్నింటి లక్ష్మారెడ్డి– సత్యలక్ష్మి దంపతుల కుమార్తె రేణుక(23)ని పెద్ద గూడెం గ్రామానికి చెందిన రైతు నోముల బాల్‌రెడ్డికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి బాల్‌రెడ్డి ఫోన్ ధ్వంసమంది. ఈ ఘట నపై భార్యభర్తల మధ్య వాదోపవాదాలు జరగడంతో రేణుకను భర్త చేయి జేసు కున్నాడు. ఆదివారం ఉదయం ఐదు గంటలకు ట్రాక్టర్‌కు డీజిల్ కొనుగోలు చేసేందుకు బయటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని గది తలుపు వేసి ఉందని, బల వంతంగా తలుపు తెరవగా రేణుక ఊరేసుకుని ఉందని భర్త చెబుతున్నాడు. సమాచారం అందెకున్న సీఐ వెంకటేష్‌తోపాటు ఏసీపీ శంకర్, పోచంపల్లి ఎఎస్‌ఐ ఇద్దయ్య, రేణుక తల్లిదండ్రులు పెద్దగూడెం చేరుకున్నారు. అప్పటికే రేణుక మృత దేహం నేలపైనే ఉంది. ఉరేసుకుంటే నాలుక బయటికి రావడం, మూతి వంకర పోవడం జరుగుతుందని, రేణుక మృతదేహంపై మెడ కింద గాటు మినహా ఎటు వంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేశారని బాల్‌రెడ్డి కుటుంబంపై రేణుక తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టారు. అయితే కొంతమంది పెద్దమనుషులు ఇరువర్గాలకు రాజీ చేసినట్లు సమాచారం. రూ.6 లక్షలతోపాటు ఇద్దరు పిల్లలకు చెరో ఎకరం చొప్పున బాల్‌రెడ్డి ఇచ్చేటట్లు పెద్దలు రాజీ చేసినట్లు తెలిసింది. దీంతో తమ కుమార్తె కడుపునొప్పితో బాధపడుతోందని, భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రేణుక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపె ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.
Updated Date - 2021-06-28T07:46:42+05:30 IST