ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనుమరాలి పెళ్లి చూడకుండానే..

ABN, First Publish Date - 2021-10-18T06:23:47+05:30

మనుమరాలి పెళ్లి చూడకుండానే ఓ తా త రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈవిషాద సంఘటన సూ ర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.

మృతదేహంతో రాస్తారోకో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి రోజే రోడ్డు ప్రమాదంలో తాత మృతి

గ్రామస్థులను పెళ్లికి ఆహ్వానించి వస్తుండగా ప్రమాదం

క్రాస్‌రోడ్డు వద్ద ఢీకొన్న టిప్పర్‌... అక్కడికక్కడే మృతి

గరిడేపల్లి, అక్టోబరు 17: మనుమరాలి పెళ్లి చూడకుండానే ఓ తా త రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈవిషాద సంఘటన సూ ర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుమ్మ డం గ్రామంలో కోటమైసమ్మ  గుడివద్ద  ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే తన మనుమరాలి పెళ్లికి రావాలని తాత పెండెం వెంకటయ్య(55) గ్రామంలోని బంధువులు, గ్రామస్థులను ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే కాలినడకన సూర్యాపేట క్రా్‌స్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా అప్పన్నపేటవైపు నుంచి వస్తున్న టిప్పర్‌ డ్రై వర్‌ వెంకటయ్యను ఢీకొన్నాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మనమరాలి పెళ్లిరోజే తాత రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో గ్రామం విషాదంలో మునిగింది. వెంకటయ్య మృతిచెందిన దుఃఖంలోనే మనమరాలి పెళ్లి జరిపించారు. 

మృతదేహంతో రాస్తారోకో..

కుటుంబానికి న్యాయంచేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డి మాండ్‌చేస్తూ బంధువులు, గ్రామస్థులు వెంకటయ్య మృతదేహంతో కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా సుమారు రెండు కిలో మీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. మండలంలో కంకర మిల్లు ల కారణంగా టిప్పర్‌లారీలు ఇష్టానుసారంగా తిరిగి రోడ్డు ప్రమా దాలకు కారణమవుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. మృతుడి కు టుంబానికి న్యాయం చేస్తామని ట్రైనీ ఎస్‌ఐ సతీష్‌ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల ఎస్‌లు వెంకట్‌రెడ్డి, విజ యప్రకాశ్‌ బందోబస్తు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టంనిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియాఆస్పత్రికి తరలించారు.  మృతు ని కుమార్తె రజిత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-10-18T06:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising