సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2021-12-10T06:09:17+05:30
మత్స్యకారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఫారెస్ట్ డివిజన్ అధికారి సాల్మన్‌రాజు అన్నారు.
సాగర్ జలాశయంలోకి చేపపిల్లలను వదులుతున్న సాల్మన్‌రాజు
నాగార్జునసాగర్, డిసెంబరు 9: మత్స్యకారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఫారెస్ట్ డివిజన్ అధికారి సాల్మన్‌రాజు అన్నారు. సాగర్ హిల్‌కాలనీలో చిల్డ్రన్ పార్కు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను గురువారం నదిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు తప్పనిసరిగా సభ్యత్వాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1,280 ప్రాజెక్టుల్లో చేపలు వదలాల్సి ఉండగా, ప్రస్తుతం 1,207 ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ ఎఫ్‌డీవో మారయ్య, డ్యాం ఆర్‌ఐ శ్రీనివా్‌సరావు, అప్పారావు, శ్రీను, బంగారీ, రమణ పాల్గొన్నారు.
Updated Date - 2021-12-10T06:09:17+05:30 IST