ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా వేణుగోపాల స్వామి కల్యాణం

ABN, First Publish Date - 2021-02-28T06:02:52+05:30

మండలంలో హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరు కల్యాణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

తాళిబొట్టును భక్తులకు చూపుతున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 27 : మండలంలో హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరు కల్యాణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం యాజ్ఞికుడు ప్రతాపురం మత్య్సగిరి, కారంపూడి కృష్ణమాచార్యులు, అర్చకుడు విశాల్‌శర్మ వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేడుకకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్యాణోత్సవానికి ముందు ఎదుర్కోలు వేడుక ఆ కట్టుకుంది. దేవస్థాన అనువంశిక చైర్మన్‌ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి రాజేశ్వరి దంపతులు స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించగా, దార ఈశ్వరయ్య అనే భక్తుడు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డాక్టర్‌ భాస్కర్‌ భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణోత్సవం అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వేడుకలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, చిట్యాల మునిసిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్త య్య, సర్పంచ్‌ గోసుల భద్రాచలం, చెర్వుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య, ఎంపీటీసీ పాశం శ్రీనివా్‌సరెడ్డి, వడ్డే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పాటల చిత్రీకరణకు క్లాప్‌ కొట్టిన చిరుమర్తి
గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి క్షేత్ర ప్రాశస్త్యం,  స్వామి వారి మహిమలను చాటిచెప్పేలా ఇదే గ్రామానికి చెందిన అల్ల్లె శ్రీహరి నిర్మిస్తున్న పాటల చిత్రీకరణకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. మొత్తం ఆరు పాటలతో పాటు దేవస్థానానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు నిర్మాత అల్ల్లె శ్రీహరి తెలిపారు.


Updated Date - 2021-02-28T06:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising