ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెరైటీ చోరీ.. లేఖలో దొంగ ఏం రాశాడంటే...

ABN, First Publish Date - 2021-09-30T18:09:26+05:30

యాదాద్రి భువనగిరి: ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఎక్కడ దొంగతనం జరిగిందో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగిరి: ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఎక్కడ దొంగతనం జరిగిందో అక్కడికే 24 గంటల్లో ఆ బైక్ చేరుకుంది. అంతేకాదు ఆ బైక్‌తోపాటు ఓ లేక కూడా ఉంది. సినిమాలో మాదిరిగా విస్తుగొలుపుతున్న వెరైటీ చోరీ స్టోరీ ఇప్పుడు చూద్దాం...


సాధారణంగా ఏదైన చోరీకి గురైతే.. మళ్లీ తిరిగి రాదు.. కానీ బైకును దొంగతనం చేసిన వ్యక్తి తిరిగి ఆ బైకును యధావిధిగా అక్కడే ఉంచి వెళితే ఎలా ఉంటుంది? ఆ బైకు యజమాని ఆనందానికి అవధులే ఉండవు. అంతేకాదు అంతా విచిత్రం అనిపిస్తుంది.. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిజంగానే ఇలాంటి సంఘటన జరిగింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రామన్నపేట మండలం, సూరారం గ్రామానికి చెందిన నరసింహ మంగళవారం మోత్కూరుకు వచ్చాడు. తనకు మనవడు పుట్టాడన్న సంతోషంలో మిత్రులతో కలిసి ఓ వైన్ షాపు వద్ద పార్టీ చేసుకున్నాడు. అక్కడే తన బైక్‌ను పార్క్ చేసి.. పార్టీ అనంతరం చూస్తే వాహనం కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజు ఆ వైపు షాపు వద్దకు వచ్చిన  నరసింహకు బైక్ కనిపించింది. అంతేకాదు ఓ లేఖ కూడా ఉంది. అది చదివి విస్తుపోయాడు. ‘బాబాయ్ ఏమీ అనుకోవద్దు డబ్బులు అవసరం ఉండి ఇంటికి వెళ్లి వచ్చాను. బైక్ తీసుకువెళ్లినందుకు ఏమీ అనుకోవద్దు’ అని రాసి ఉంది. దీంతో తన బైక్ దొరికిందంటూ నరసింహ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

Updated Date - 2021-09-30T18:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising