ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-09-17T06:18:04+05:30

మూల మలు పులో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

భువనగిరి మండలం నందనం శివారులో నుజ్జునుజ్జయిన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

మృతులిద్దరూ హైదరాబాద్‌ వాసులు               

బస్సు డ్రైవర్‌ చాకచక్యంతో                   

  ప్రయాణికులు సురక్షితం

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 16:  మూల మలు పులో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో గురువారం ఈ ఘటన జరిగింది.  భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం..  హైదరా బాద్‌ యూసుఫ్‌నగర్‌ వినాయకనగర్‌ ప్రాంతానికి చెందిన సింగారి వెంక టేశ్‌(38), సిల్వేరు యాదయ్య(40), అమీర్‌పేటకు చెందిన దాలయ్య, జోగి నాయుడు ఓ భవన నిర్మాణానికి సెంట్రింగ్‌ పనులు నిర్వహించేందుకు కారులో వలిగొండకు వస్తున్నారు. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు నల్లగొండ నుంచి భువనగిరికి 58మంది ప్రయాణికులతో వెళుతోంది.  కారును యజమాని వెంకటేష్‌ నడుపుతుండగా, మార్గమధ్యంలోని భువన గిరి మండలం నందనం గ్రామ శివారులోని మూలమలుపులో ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జును జ్జయి, కారులో ఉన్న  నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటేశ్‌, యాదయ్య మృతి చెందారు. మెరుగైన చికిత్స కోసం పోలీసులు మరో ఇద్దరిని  సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే 58మంది ప్రయాణీకులతో వస్తున్న బస్సుకు ఎదురుగా బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి స్టీరింగ్‌ను పక్కకు తిప్పి  రోడ్డు వెంట ఉన్న చెట్టును నెమ్మదిగా ఢీకొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారని స్థానికులు తెలి పారు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. యాదయ్యకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేష్‌, యాదయ్య స్వస్థలం సంగారెడ్డి జిల్లా కేంద్రం. కాగ, 30 ఏళ్ల కిత్రం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ ప్రమాదంలో భువనగిరి–చిట్యాల రహదారిపై ట్రాఫిక్‌కు అరగంట సమయం అంతరాయం ఏర్పడగా పోలీ సులు ట్రాఫిక్‌ను పునరుద్ధ రించారు. ఈమేరకు కేసు  దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

వరుసగా రెండో రోజు ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు

చిట్యాల– భువనగిరి మార్గంలో మలు పులు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 15న రామన్నపేటలో పభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో భువనగిరి నుంచి నల్లగొండ వైపు వెళుతున్న యాదగిరిగుట్ట డిపో బస్సు, టిప్పర్‌ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ నంద్యాల సిద్ధులు సహా ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. మరుసటి రోజు గురువారం ఇదే మార్గంలో కారు–ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెంది, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే మార్గంలో రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో 2015 అక్టోబరు నెలలో లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో  బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో చిట్యాల – భువనగిరి మార్గంలో ప్రయాణం భయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.






Updated Date - 2021-09-17T06:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising