ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ ఎంపీల డ్రామా

ABN, First Publish Date - 2021-12-09T06:28:35+05:30

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పార్లమెంట్‌లో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ 

హుజూర్‌నగర్‌ , డిసెంబరు 8 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్టోబరు నుంచి వరి కోతలు మొదలయ్యాయని; మూడు నెలలైనా ధాన్యం సేకరణ చేయలేదన్నారు. కాగా ఆగస్టు నాటికి 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ఆదేశాలున్నా సగభాగం కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించకుండా; పార్లమెంట్‌లో డ్రామాలు ఆడుతూ వాకౌట్‌ చేస్తున్నారన్నారు. తెలంగాణాలో ధాన్యం సేకరణ చేయకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం సేకరణపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ కేంద్రాన్ని కోరారు. ఉత్తమ్‌ ప్రశ్నలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దానిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని అన్నారు. బియ్యం సేకరణ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.  

Updated Date - 2021-12-09T06:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising