ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో కరోనాతో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-04-17T06:31:49+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో శుక్రవా రం ముగ్గురు మృతిచెందగా 750పాజిటివ్‌ వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురువుతున్నారు.

భువనగిరి మండలం నమాత్‌పల్లిలో ఎక్స్‌కవేటర్‌తో మృతదేహాన్ని తరలిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, ఏప్రిల్‌ 16 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో శుక్రవా రం ముగ్గురు మృతిచెందగా 750పాజిటివ్‌ వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురువుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు(60) కరోనాతో మృతిచెందింది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యాని కి గురవగా చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించా రు. పరీక్షల్లో పాజిటివ్‌ రాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామమైన నమాత్‌పల్లి గ్రా మానికి తేగా సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఖననం చేశారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రానికి చెందిన 50ఏళ్ల వ్యక్తి కరోనాతో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని జనరల్‌ ఆసుపత్రి సిబ్బంది పెన్‌పహాడ్‌ కు తీసుకొచ్చి వారే అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని ఓ గ్రామంలో కరోనాతో మహిళ మృతి చెందింది. ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఆమెకు ఐసోలేషన్‌లో చికిత్స అందించగా శుక్రవారం ఉదయం మృతి చెందింది. శాలిగౌరారం ఎస్‌బీఐలో పనిచేస్తున్న సిబ్బందికి కొవిడ్‌ రాగా అధికారులు శుక్రవారం బ్యాంకును మూసివేశారు. దీనిపై బ్యాంకు మేనే జర్‌ను సంప్రదించగా బ్యాంకును శానిటైజ్‌చేసి శనివారం  తెరుస్తామన్నారు. కొండమల్లేపల్లి మండలంలో వారం రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్య లో నమోదు అవుతున్నాయి. శుక్రవారం 50మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 30మందికి పాజిటివ్‌ వచ్చింది. నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో 158మందికి పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజి టివ్‌ వచ్చింది. యాదగిరిగుట్ట పీహెచ్‌సీలో 48మందికి పరీక్షలు నిర్వహించ గా 24మందికి పాజిటివ్‌ వచ్చింది. దేవరకొండలో 32, కొండమల్లేపల్లి 30, వలిగొండలో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  


Updated Date - 2021-04-17T06:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising