ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు గంటలు ఆరుబయటే విధులు

ABN, First Publish Date - 2021-10-27T06:47:16+05:30

నెల రోజులుగా నేరేడుచర్ల మునిసిపాలిటీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొండముచ్చు ఎట్టకేలకు మంగళవారం చిక్కింది.

ఆరుబయట విధులు నిర్వహిస్తున్న మునిసిపల్‌ కార్యాలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొద్దిరోజులుగా నేరేడుచర్ల ప్రజలపై కొండముచ్చు దాడి

మునిసిపాలిటీ కార్యాలయంలోకి దూరడంతో పట్టివేత

ఊపిరిపీల్చుకున్న స్థానికులు  

నేరేడుచర్ల, అక్టోబరు 26: నెల రోజులుగా నేరేడుచర్ల మునిసిపాలిటీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొండముచ్చు ఎట్టకేలకు మంగళవారం చిక్కింది. ప్రతి రోజూ ప్రజలపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో దానిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నుంచి నిపుణులు పిలిపించారు.  వారు బంధించేందుకు ప్రయత్నించే క్రమంలో మునిసిపాలిటీ కార్యాలయంలోకి దూరింది. దీంతో కార్యాలయం సిబ్బంది సుమారు మూడు గంటల పాటు ఆరుబయటే విధులు నిర్వహించాల్సి వచ్చింది. మొదట బోన్‌లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోవడంతో వలల సాయంతో చాకచక్యంగా బంధించారు. బందీగా ఉన్న కొండముచ్చును చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండముచ్చును అటవీ ప్రాంతంలో వదిలి వేస్తారని మునిసిపాలిటీ కమిషనర్‌ గోపయ్య తెలిపారు. ఎట్టకేలకు కొండముచ్చును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.  



Updated Date - 2021-10-27T06:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising