ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనికోసం ఊరొస్తారు.. బైకులు మాయం చేస్తారు

ABN, First Publish Date - 2021-06-22T07:28:32+05:30

వాళ్లిద్దరూ తండ్రీకుమారులు. ఎలక్టికల్‌ వస్తువు లు మరమ్మతు చేస్తామని బైక్‌ ద్వారా రికార్డెడ్‌ వాయిస్‌ లౌడ్‌ స్పీకర్‌తో పట్టణాల్లో, గ్రామాల్లో పగటి పూట ప్రచారం చేస్తారు.

మఠంపల్లిలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ శివరాంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకున్న తండ్రీకుమారులు

కుమారుడి అరెస్టు 

పరారీలో తండ్రి 

 గతంలో పలు కేసులు

మఠంపల్లి(మేళ్లచెర్వు), జూన్‌ 21: వాళ్లిద్దరూ తండ్రీకుమారులు. ఎలక్టికల్‌ వస్తువు లు మరమ్మతు చేస్తామని బైక్‌ ద్వారా రికార్డెడ్‌ వాయిస్‌ లౌడ్‌ స్పీకర్‌తో పట్టణాల్లో, గ్రామాల్లో పగటి పూట ప్రచారం చేస్తారు. అదే సమయంలో ఇళ్లల్లో ఉన్న బైకులను గమనిస్తారు. రాత్రిళ్లు వాటిని చోరీ చేస్తారు. ఇప్పటికే పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చినా వారిలో పరివర్తన రాలేదు. తండ్రి పరారీ కాగ, కుమారుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి రూ.3.30 లక్షల విలువైన ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మేళ్లచెర్వు పోలీస్‌ స్టేషన్‌లో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోదాడ రూరల్‌ సీఐ శివరాంరెడ్డి  వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగుంటిపల్లికి చెందిన గుంటిపల్లి వెంకట ప్రసాద్‌, చందూ తండ్రీకుమారులు.  వీరిద్దరూ ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు మిక్సీలు మర మ్మతు చేస్తామని  రికార్డు చేసిన వాయిస్‌ ద్వారా స్పీకర్‌తో బైక్‌పై ప్రచారం చేస్తారు. మరమ్మతు చేస్తూనే..అదే సమయంలో ఇళ్లల్లో ఉన్న బైక్‌లను గమనిస్తారు. రాత్రి వేళల్లో కట్టర్‌ ద్వారా బైకుల తాళాన్ని తీసి చోరీ చేఆ్తరు.  మేళ్లచేర్వు మండలంలో గత నెలలోనే నాలుగు బైకులు చోరీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  ఆదివారం సాయంత్రం కందిబండ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన బైక్‌ను ఉన్న చందూ పోలీసులను అరెస్టు చేశారు. కుమారుడిని బైకుకు ఎస్కార్ట్‌గా కారులో ఉన్న తండ్రి పరారయ్యాడు.   నిందితుడు చందు నుంచి  పోలీసులు రూ.3.30 లక్షల విలు వైన  ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. (వీటిలో మేళ్లచెర్వుకు చెందినవి నాలుగు, ఖమ్మం పట్టణానికి చెందినవి మూడు ఉన్నాయి)

గతంలో పలుకేసులు ..

ఈ తండ్రీకొడుకులపై ఏపీలోని పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, అచ్చంపేట, నర్సరావుపేట, పిరంగిపురం, నంద్యాల పోలీస్‌ స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో  జైల్లో ఉండి బెయిల్‌పై బయటికి వచ్చారు. ఒక సారి పట్టుబడిన ప్రాంతంలో ఉండకుండా మకాం మార్చడం వీరి శైలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మఽధిర మండలం దేశినేనిపాలెంలో నివసిస్తూ  బైకులను చోరీ చేస్తున్నారు.  కేసును చేధించిన ఎస్‌ఐ సీహెచ్‌ నరేష్‌, కానిస్టేబుల్‌ రామారావు, ఎస్‌. వెంకటేశ్వర్లును సీఐ శివరాంరెడ్డి అభినందించారు. 

  

Updated Date - 2021-06-22T07:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising