ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత సన్మార్గంలో నడవాలి

ABN, First Publish Date - 2021-01-24T05:59:20+05:30

యువత చెడు మార్గా న్ని వీడి సన్మార్గంలో పయనించాలని శానసమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125జయంతి సందర్భంగా జనగణమన ఉత్స వ సమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని చంద్రబోస్‌ విగ్రహానికి శనివారం పూల మాలలు వేసి జాతీయ గీతాలాప న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

ఉత్సాహంగా జనగణమన జాతీయ గీతాలాపన

నల్లగొండ కల్చరల్‌, జన వరి 23: యువత చెడు మార్గా న్ని వీడి సన్మార్గంలో పయనించాలని శానసమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125జయంతి సందర్భంగా జనగణమన ఉత్స వ సమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని చంద్రబోస్‌ విగ్రహానికి శనివారం పూల మాలలు వేసి జాతీయ గీతాలాప న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి నచ్చిన రంగాల్లో రాణించాలన్నారు. ప్రతి రంగంలో ఇతర రాష్ట్రాలవారే పనిచేస్తున్నారని, మన ప్రాంతానికి చెందిన వారు అటు వైపు ఎందుకు వెళ్లడంలేదో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ చైర్మన్‌ బం డా నరేందర్‌రెడ్డి, ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన మహానీయులను గౌరవించినప్పుడే క్రమశిక్షణ అలవడుతుందన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో రోడ్డు విస్తరణపనుల నేపథ్యంలో జాతీయ నాయకుల విగ్రహాలన్నింటినీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బా గుంటుందన్నారు. జిల్లా జడ్జి రమేష్‌ మాట్లాడుతూ మనల్ని మనం ఎలా గౌవించుకుంటుమో జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను, మహనీయులను గౌరవించాలన్నారు. ఇక నుంచి పట్టణంలో ఉదయం 8.30 గంటలకు నిత్యం జాతీయ గీతాలాపన ఉంటుందని నిర్వాహకులు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, నిర్వా హకులు శివకుమార్‌, కర్నాటి విజయ్‌కుమార్‌, మునిసిప ల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు. పట్టణంలో 12కూడళ్లల్లో ఒకేసారి జనగణమన గీతాలాపన కార్యక్రమం ఉత్సా హంగా జరిగింది. బస్టాండ్‌ సమీపంలో నేతాజీ విగ్రహాన్ని స్వాతంత్ర  ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న పట్టణానికి చెందిన లతీఫ్‌ ఏర్పాటు ఏశారు. లతీఫ్‌ కుమారుడు జానీ ప్రస్తుతం మునిసిపల్‌ కార్యాలయంలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనను సభకు పరిచయం చేసి జనగణమన ఉత్సవ సమితి సన్మానించింది.

Updated Date - 2021-01-24T05:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising