ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువుకు గండిపడి వృథాగా నీరు

ABN, First Publish Date - 2021-12-01T07:06:13+05:30

మండలంలోని రాయినిగూడెం గ్రామంలోని సూ రలదేవి చెరువుకు మంగళవారం సాయంత్రం గండి పడి నీరు వృథాగా పోతోంది.

చెరువుకు పడిన గండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌, నవంబరు 30: మండలంలోని రాయినిగూడెం గ్రామంలోని సూ రలదేవి చెరువుకు మంగళవారం సాయంత్రం గండి పడి నీరు వృథాగా పోతోంది. ఈ చెరువు కింద సుమారు 500 ఎకరాల సాగవుతుంది రైతులు వానాకాలం పంట చేతికి రావడంతో పంట నష్టం నుంచి రైతులు బయటపడ్డారు.   ఈ ప్రాంతానికి జీవనాధారంగా ఉన్న చెరువుకు గండి పడి నీరు వృథాగా పోవడంతో రైతులు ఆంధోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో మిషన్‌ కాకతీయ పనుల కింద చెరువు కట్టను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పనులు కూడా చేశారు.  అయితే  కాంట్రాక్టర్ల  నిర్లక్ష్యంగానే చెరువకు  గండి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తా

కోదాడ, నవంబరు 30: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. గ్రామాల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ మునగాల మండల సర్పంచ్‌ల ఫోరం నాయకులు కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లయ్య యాదవ్‌కు మంగళవారం  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.  గ్రామాల్లో  అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లింగారెడ్డి, ఉపేందర్‌, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, సంజీవ్‌, విజయలక్ష్మి విజయమ్మ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కోదాడలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

Updated Date - 2021-12-01T07:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising