ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రక్షణ కరువైంది: మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-04T06:27:03+05:30

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, న్యాయవాదులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న దామోదర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సూర్యాపేటటౌన్‌, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, న్యాయవాదులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని కోర్టు ఆవరణలో ఇటీవల జరిగిన న్యాయవాది దంపతు లు వామనరావు, నాగమణి హత్యకు నిరసనగా న్యాయవాదు లు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. హత్యకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఆయనవెంట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, చకిలం రాజేశ్వర్‌రావు, వేణారెడ్డి, అంజద్‌అలీ ఉన్నారు. 

ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి: సంకినేని

న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. న్యా యవాదులు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఆయనవెంట సంకినేని వరుణ్‌, వీరేంద్ర, మల్సూర్‌, అయోద్య, రుక్మారావు, ఫణినాయుడు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి: పటేల్‌

న్యాయవాది దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయనవెంట  షఫి ఉల్లా, వెలుగువెంకన్న, శ్రీనివాస్‌, నాగేశ్వర్‌రావు, నామాప్రవీణ్‌, పరుశరాం, పాలవరపు వేణు, సైదిరెడ్డి పాల్గొన్నారు.

సీబీఐ విచారణ చేపట్టాలి: న్యాయవాదులు

తుంగతుర్తి: వామనరావు, నాగమణిల హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని తుంగతుర్తి బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కారింగుల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం తుంగతుర్తి కోర్టు ఎదుట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు జ్ఞానసుందర్‌, చరణ్‌, పూల్‌సింగ్‌, సతీష్‌, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు. 


  



Updated Date - 2021-03-04T06:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising