కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయం
ABN, First Publish Date - 2021-11-14T06:04:57+05:30
కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు అన్నారు. హాలియాలోని పార్టీ కార్యాలయంలో కాళోజీ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాం
హాలియా, నవంబరు 13: కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు అన్నారు. హాలియాలోని పార్టీ కార్యాలయంలో కాళోజీ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని అన్నారు. కార్యక్రమంలో చెరుపల్లి ముత్యాలు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, వెంపటి శంకరయ్య, సురబి రాంబాబు, కాట్నం నాగరాజు, రావిళ్ల చెన్నయ్య, నారాయణ, చిట్టిమళ్ల శంకర్, అన్వర్, రమేష్, కృష్ణ, ఎంపీటీసీ వెంకటయ్య, కూరాకుల రవి, సురేందర్, రాములు, యాదగిరి, సైదులు ఉన్నారు.
Updated Date - 2021-11-14T06:04:57+05:30 IST