ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టుల సేవలు అభినందనీయం : బాలూనాయక్‌

ABN, First Publish Date - 2021-06-17T05:56:06+05:30

కరోనా కష్టకాలంలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలూనాయక్‌ అన్నారు.

జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, జూన 16 : కరోనా కష్టకాలంలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని  మాజీ ఎమ్మెల్యే నేనావత బాలూనాయక్‌ అన్నారు. బుధవారం ఆ యన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని జర్నలిస్టులకు బి య్యం, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా మహమ్మారి బారిన పడి అనేకమంది జర్నలిస్టులు మృతి చెంద గా, మరెందరో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తాటికోలు సర్పంచ, సర్పంచల సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు జూలూరి ధనలక్ష్మి, బాలనారాయణగౌడ్‌,  మండల అధ్యక్షుడు లోకసాని శ్రీధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన, వేణుధర్‌రెడ్డి, యూనూస్‌, కర్ణాకర్‌, శ్రీశైలంయాదవ్‌, రాంసింగ్‌, వెంకటేశ్వర్లు, కుమార్‌ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శ
 కరోనాతో ఇటీవల మృతిచెందిన దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన కొర్ర రాగ్య, నేనావత హనుమంతు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌ బుధవారం పరామర్శించారు. కరోనాతో మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తమవంతుగా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆయన వెంట లోకసాని శ్రీధర్‌రెడ్డి, జూలూరి ధనలక్ష్మీ, గౌతమి రాంసింగ్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-06-17T05:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising