ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN, First Publish Date - 2021-01-17T05:40:45+05:30

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్‌ చేశారు.

దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య 

యాదాద్రి టౌన్‌, జనవరి 16: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి  బీర్ల అయిలయ్య డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారా చెంత యాదాద్రి భూ నిర్వాసితులకు న్యాయం చేయాని శనివారం రీలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి పేరుతో బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ 2016లో భూ నిర్వాసితులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలతో పాటు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయని గుర్తు చేశారు. విస్తరణలో భాగంగా నిర్వాసితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ముందుగా వైకుంఠ ద్వారం  చెంత కొబ్బరికాయ కొట్టి దీక్షలు ప్రారం భించారు. దీక్షల్లో ఆ పార్టీ నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేశం, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising