నల్లగొండ అధికారుల పనితీరు భేష్
ABN, First Publish Date - 2021-10-21T06:44:37+05:30
నల్లగొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు అధికారులు తీ సుకున్న చర్యలు అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జిల్లా ఎస్పీలు, ఎక్సైజ్ అధికారులతో మత్తుపదార్థాల నియంత్రణపై బుధవారం సమీక్ష నిర్వహించారు.
విశాఖ మన్యం వెళ్లి అరెస్టులు చేయడం అభినందనీయం
గంజాయి, గుడుంబాపై అన్నిజిల్లాల్లో ఉక్కుపాదం మోపండి
మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్షలో సీఎం కేసీఆర్
నల్లగొండ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు అధికారులు తీ సుకున్న చర్యలు అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జిల్లా ఎస్పీలు, ఎక్సైజ్ అధికారులతో మత్తుపదార్థాల నియంత్రణపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు విస్తృత తనిఖీలు చేపట్టి విశాఖమన్యం వరకు వెళ్లి అరెస్టులు చేయడం, గంజాయి స్వాధీనం చేసుకోవడాన్ని సీఎం అభినందించారు. ఇతర జిల్లాల అధికారులు ఇదే తరహాలో పనిచేయాలని సూచించారు. విశాఖ మన్యంలో చేపట్టిన ఆపరేషన్స్, పరిణామాలను నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను సమావేశంలోనే అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో సరిహద్దు వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుందాం, మీరు ముందుకు వెళ్లండి అంటూ ప్రోత్సహించారు. గంజాయి, గుడుంబా, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ఉక్కుపా దం మోపాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని, భవిష్యత్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉజ్వలంగా ఉండబోతోందన్నారు. ఈనేపథ్యంలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల వినియోగం, నేరాలు పెరగడం వంటివి జరిగితే అది రాష్ట్ర భవిష్యత్‌కు మంచిది కాదన్నారు. నక్సల్స్ ఏరివేతలో అంతా అనుభవం ఉన్నవారేనని, అదే తరహాలో గంజాయి, గుడుంబాను నియంత్రించాలని సీఎం స్పష్టంచేశారు. గంజాయి సాగు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలకు ప్రవేశించడం, స్థానికంగా విక్రయం, వినియోగం అనే అంశాలను లోతుగా అధ్యయనంచేసి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిఘా వ్యవస్థ పటిష్ఠం చేసుకుంటేనే వీటి నియంత్ర ణ సాధ్యమవుతుందన్నారు. మత్తు పదార్థాల నియంత్రణ లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఎక్కడైనా రాజకీయ జోక్యం, ఒత్తిడి కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గంజాయి, గుడుంబా నియంత్రణకు విశేష కృషి చేసే అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా పదోన్నతుల్లో ప్రత్యేక అవకాశం, నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో అధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతానని, రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో చిన్నపాటి సమీక్ష సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కొద్దినెలల్లోనే రా ష్ట్రంలో గంజాయి నియంత్రణలోకి రావాలని, అందుకు ప్ర భుత్వం నుంచి పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సహాయ సహకారాలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు.
Updated Date - 2021-10-21T06:44:37+05:30 IST