ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-08-04T05:47:58+05:30

మోత్కూరులో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇది సరికాదని బీఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్షు డు బుర్ర శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, ఆగస్టు 3: మోత్కూరులో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇది సరికాదని బీఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్షు డు బుర్ర శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మోత్కూరులోనే కొనసాగించాలని కోరుతూ మోత్కూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు మంగళవారం ధర్నా చేశా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల ప్రజలకు అందుబాటులో ఉందని, ఈ కార్యాలయాన్ని ఎత్తివేసి, భువనగిరి/యాదగిరిగుట్టలో కలిపితే ఈ మం డలాల ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం 50 నుంచి 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. మోత్కూరు నుంచి ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎస్సీ, బీసీ సంక్షేమ డివిజన్‌ కార్యాలయాలు, ఎస్టీ హాస్టల్‌, కళాశాల స్థాయి విద్యార్థుల హాస్టల్‌ తరలినందున ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. అనంతరం ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాలడుగు ఉపసర్పంచ్‌ ఎడ్ల భగవంతు, నాయకులు నిలిగొండ మత్స్యగిరి, చొల్లేటి సోమేష్‌, బయ్యని గిరిప్రసాద్‌, మహ్మద్‌ ఖలీల్‌, కొంపెల్లి గోరయ్య, బయ్యని నర్సింహ, ప్రసాద్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising