ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోములలో కాకతీయుల రంగమండపం

ABN, First Publish Date - 2021-10-19T06:10:57+05:30

మండలంలోని నోముల గ్రామంలో నరసి ంహ ఆలయం పునరుద్ధరణ పనులు చేస్తుండగా కాకతీయుల నాటి 13వ శతాబ్దంలోని రంగ మండపం బయటపడింది.

నోముల గ్రామంలో కాకతీయుల రంగమండపాన్ని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, అక్టోబరు 18 :  మండలంలోని నోముల గ్రామంలో నరసి ంహ ఆలయం పునరుద్ధరణ పనులు చేస్తుండగా కాకతీయుల నాటి 13వ శతాబ్దంలోని రంగ మండపం బయటపడింది. పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి సోమవారం నోముల గ్రామంలోని నరసింహుడి ఆలయాన్ని సందర్శించడంతో పాటు, బయటపడిన రంగమండపా న్ని పరిశీలించారు. ఆలయంలోని నరసింహస్వామి త్రిమూర్తి, భైరవ, భి న్నమైన సూర్యుని శిల్పాల శైలిని బట్టి ఈ ఆలయాన్ని కాకతీయులు 13వ శతాబ్దిలో నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. గ్రామస్థులు ఆలయం చుట్టూ శుభ్రపరిస్తే ఆలయానికి సంబంధించిన మరిన్ని కట్టడ భాగాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 750ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయ శిల్పాలను భద్రపరిచి భావి తరాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ గౌరవ సలహాదారుడు గుండంరాజు కల్యాణ్‌కుమార్‌, కమిటీ సభ్యుడు చిక్కు శ్రీనివాస్‌, సామ రవీందర్‌రెడ్డి, దాస్యం సురేందర్‌, గుర్రం శివశంకర్‌రెడ్డి, రాచకొండ పెద్దులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising