ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండస్ట్రియల్‌ పార్కును ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-07T06:42:26+05:30

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పేదల అసైన్డ్‌ భూముల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పుచేస్తున్న వేలిమినేడు గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, డిసెంబరు 6: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పేదల అసైన్డ్‌ భూముల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. గ్రామ రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 320 ఎకరాల అసైన్డ్‌ భూములను 200 మంది రైతులు సాగుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఆ భూములను లాక్కొని హెటిరో కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే జరిగితే గ్రామ రైతులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పొయ్యిని రాజేస్తామని హెచ్చరించారు.  పోలీసులు ఆర్డీవో కార్యాలయం ఎదుట భారీగా మోహరించగా, రైతులు వారితో వాగ్వాదం చేశారు. అనంతరం వినతి పత్రాన్ని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో అంశాల సత్యనారాయణ, సామ రామిరెడ్డి, కోరగోని రామచంద్రం, గుర్రం జంగయ్య, అర్రూరి శివకుమార్‌, మెట్టు శ్రీశైలం, మెట్టు సత్తయ్య, మెట్టు సైదులు, ఎల్కరాజు మారయ్య, గుర్రం వెంకటేష్‌, వనజ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising