ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కుటుంబ సభ్యుల ఔదార్యం

ABN, First Publish Date - 2021-12-07T06:42:44+05:30

చదువు, క్రీడల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లకు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కటుంబసభ్యులు చేయూతనందించారు.

గౌతమి, గాయత్రిలకు రూ.2లక్షల చెక్‌ను అందజేస్తున్న ఎస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ గుంటకండ్ల సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, డిసెంబరు 6: చదువు, క్రీడల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లకు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కటుంబసభ్యులు చేయూతనందించారు. పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన రణపంగి వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమా ర్తెలు గౌతమి, గాయత్రి ఉన్నారు.  గౌతమి ఉన్నత విద్య కోసం, గాయత్రి జాతీయ క్రీడల్లో రాణిస్తున్నందున పోత్సాహం నిమిత్తం మంత్రి జగదీష్‌రెడ్డి సతీమణి, ఎస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రూ.2 లక్షల చెక్కును సమకూర్చారు. ఈ చెక్కును గౌతమి, గాయత్రిలకు మంత్రి జగదీష్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డితో సునీత ఇప్పించారు. ఈ విద్యార్థినుల చిన్నతనంలో తల్లి మృతి చెందడంతో  కూలినాలి చేస్తూ తండ్రి వారిని చదివిస్తున్నారు. ఈ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించడానికి ఈ సాయం అందించినట్లు మంత్రి కుటుంబ సభ్యులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్‌ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్‌, సర్పంచ్‌ మామిడి వెంకన్న, మార్కెట్‌ కమిటీ డైరె క్టర్‌ దాచేపల్లి భరత్‌, మహిళ సంఘం నాయకురాలు గార్లపాటి స్వర్ణ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాతాల జానకిరాంరెడ్డి,  తూముల ఇంద్రాసేనారావు, నల్లపు శ్రీనివాస్‌, జూకూరి అంజయ్య, రణపంగి సైదులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-07T06:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising