ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి

ABN, First Publish Date - 2021-10-21T06:49:07+05:30

ఆహారభద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని ఆహార భద్రత కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం సీతారాంపురం, తిమ్మాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ చౌక ధర దుకాణాలను, పెన్‌పహాడ్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తిరుమల్‌రెడ్డి తనిఖీ చేశారు.

అర్వపల్లి మండలంలోని పాఠశాలలో వివరాలు తెలుసుకుంటున్న తిరుమల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, పెన్‌పహాడ్‌, అక్టోబరు 20: ఆహారభద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని ఆహార భద్రత కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం సీతారాంపురం, తిమ్మాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ చౌక ధర దుకాణాలను, పెన్‌పహాడ్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తిరుమల్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత చట్టంపై జిల్లా, మండల, గ్రామస్థాయిలో విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నా రు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహా రం అందించాలన్నారు. ఆర్థికంగా బలోపేతమైన కుటుంబాలు తెల్లరేషన్‌ కార్డులను వెంటనే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేయాలన్నారు. అర్వపల్లి, తిమ్మాపురం పాఠశాలల్లో తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. తిమ్మాపు రం సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, ఆహార భద్రత కమిషన్‌ సభ్యులు గోవర్థన్‌రెడ్డి, భారతి, డీఆర్‌డీ వో పీడీ కిరణ్‌కుమార్‌, అశోక్‌, డీఎ్‌సవో విజయలక్ష్మి, జ్యోతిపద్మ, దయానందరాణి, శ్రీజ, సర్పంచ్‌ బైరబోయిన సునీత, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T06:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising