సెమిస్టర్ విధానాన్ని తెచ్చిన ఘనత బీఆర్‌ఏఓయూదే
ABN, First Publish Date - 2021-08-02T07:17:09+05:30
దేశంలోనే దూర విద్యలో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చి విజయవంతంగా అమ లు చేస్తున్న ఘనత బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)కే దక్కిందని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని బీఆర్‌ఏఓయూ రీజినల్ సెంటర్‌ను ఆయన సందర్శించారు.
బీఆర్‌ఏఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు
నల్లగొండ క్రైం, ఆగస్టు 1: దేశంలోనే దూర విద్యలో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చి విజయవంతంగా అమ లు చేస్తున్న ఘనత బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)కే దక్కిందని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని బీఆర్‌ఏఓయూ రీజినల్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రీజినల్‌సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ బి.ధర్మానాయక్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, సిబ్బంది వీసీ సీతారామారావును సత్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నల్ల గొండ ఉమ్మడి జిల్లా అడ్మిషన్లు, ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమ న్నారు. కరోనా నేపథ్యంలో వీడియో, ఆడియోతో పాటు ఆన్‌లైన్ ద్వారా ఇతర విద్యార్థులకు బోఽధిస్తున్నా మన్నారు. కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తున్న తరుణంలో 2030 నాటికి 50 శాతం మంది ప్రజలకు డిగ్రీ పట్టాలు అందజేసే అవకాశం ఉందన్నారు. దేశంలోనే 800ల యూనివర్సిటీలు, 2వేల కళా శాలలు, 16 దూర విద్య కేంద్రాల్లో నూతన విద్యావిధానం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
Updated Date - 2021-08-02T07:17:09+05:30 IST