కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరలో పూర్తి
ABN, First Publish Date - 2021-09-03T06:34:29+05:30
కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లా ఆర్‌ఆండ్ బీఎస్ నర్సింహానాయక్ అన్నారు.
కలెక్టరేట్ భవనాన్ని పరిశీలిస్తున్న నర్సింహానాయక్
చివ్వెంల, సెప్టెంబరు 2: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లా ఆర్‌ఆండ్ బీఎస్ నర్సింహానాయక్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని కుడకుడలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. కలెక్టరేట్ భవనాన్ని ఆనుకుని ఈవీఎంల స్ర్టాంగ్ రూమ్ గోదాంలను నిర్మించే పనులను రెవెన్యూ అధికారులకు అప్పగించామని అన్నారు. ఆయనతో ఏఈ యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-03T06:34:29+05:30 IST