ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యామ్నాయం బీజేపీనే

ABN, First Publish Date - 2021-04-13T06:46:06+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీ అని, పార్టీ ఎదుగుతుందనడానికి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితా లే నిదర్శనమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తరుణ్‌ఛుగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌


హాలియా, ఏప్రిల్‌ 12: రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీ అని, పార్టీ ఎదుగుతుందనడానికి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితా లే నిదర్శనమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. అనుముల మండలం పంగవానికుంటతండాలో సోమవారం నిర్వహించి న ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఆదర్శవంత పాలన కొనసాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు సైతం కేంద్రమే సమకూరుస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమయ్యాయని, ఈ ప్రాంత ప్రజల కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలను ఓడించి బీజేపీకి పట్టంకట్టి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. బలహీనవర్గాలకు చెందిన గిరిజనుడైన రవినాయక్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట బీజేపీ నాయకులు వీరేల్లి చంద్రశేఖర్‌, గార్లపాటి జితేందర్‌, పాపయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-04-13T06:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising