ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులు నైపుణ్యం పెంచుకోవాలి: డీఈవో

ABN, First Publish Date - 2021-11-28T06:02:48+05:30

ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు దోహదపడతాయని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు.

చిట్యాల రూరల్‌: గుండ్రాంపల్లి పాఠశాలలో మాట్లాడుతున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం/ చిట్యాల రూరల్‌, నవంబరు 27: ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు దోహదపడతాయని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు. మండల పరిధిలోని మర్రిగూడ జడ్పీ హెచ్‌ఎ్‌స పాఠశాలలో శనివారం నిర్వహించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ హాజరుశాతం పెరిగేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు కలెక్టర్‌ అనుమతితో అదనపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన మెనూను సక్రమంగా అం దేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రీనివా్‌సగౌడ్‌, రీసోర్స్‌ పర్సన్‌ రమేష్‌, సీఆర్పీ శంకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిట్యాల మం డలం గుండ్రాంపల్లి, ఏపూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌సలను డీఈవో బిక్షపతి ఆకస్మికంగా తనికీ చేశారు. గుండ్రాంపల్లి జెడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగిన పాఠశాల స్కూల్‌కాంప్లెక్స్‌ సమావేశం జరుగుతుండగా పాఠశాలను సందర్శించిన డీఈఓ ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు నర్సింగరావు, జాని అఫ్ఘన్‌ ఉన్నారు.


Updated Date - 2021-11-28T06:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising