ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని ఆదరించి గెలిపించండి

ABN, First Publish Date - 2021-04-08T06:36:07+05:30

ఉప ఎన్నికలో బీజేపీని ఆదరించి గిరిజన బిడ్డనైన తనను గెలిపించాలని అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అన్నారు. మండలంలోని బోజ్యాతండాలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ప్రచారంలో మాట్లాడుతున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభ్యర్థి పానుగోతు రవికుమార్‌ 


తిరుమలగిరి(సాగర్‌), ఏప్రిల్‌ 7: ఉప ఎన్నికలో బీజేపీని ఆదరించి గిరిజన బిడ్డనైన తనను గెలిపించాలని అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అన్నారు. మండలంలోని బోజ్యాతండాలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. గిరిజనుడైన తనకు బీజేపీ పోటీచేసే అవకాశం కల్పించిందని, తండావాసులు అండగా ఉండాలని కోరా రు. మండలంలో పోడు, ప్రభుత్వ భూములకు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా కేసీఆర్‌ ప్రభు త్వం మూడేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కృష్ణానదికి పక్కనే ఉన్న పలు తండాలకు నేటికీ సాగునీరు అందడం లేదని, ఈ విషయంలో జానారెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, గిరిజనులకు రిజర్వేషన్లు 10శాతం పెంచుతామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నాడని, దీన్ని గిరిజనులు ఆలోచించాలన్నారు. నిరుద్యోగంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్టుగా లేదన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం జరుగుతుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు మోసమే జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు హుస్సేన్‌నాయక్‌, నూకల నర్సింహారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, పాండునాయక్‌, కొంపల్లి శ్రీనివాస్‌, మెండె అనిల్‌కుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - 2021-04-08T06:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising