ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుందరయ్య జీవితం ఆదర్శనీయం

ABN, First Publish Date - 2021-05-20T06:02:03+05:30

కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు.

సూర్యాపేటలో సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 (ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌)

కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్‌ భవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత పార్లమెంటులో సుందరయ్య తొలి ప్రతిపక్షనేతగా వ్యవహరించారన్నారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి రాజకీయనేతలు నిరాడంబరంగా జీవించాలని సూచించారన్నారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,  పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రోషపతి ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మేళ్లచెర్వు, మఠంపల్లి, నడిగూడెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, కోదాడ, చిలుకూరు, మునగాల మండలాల్లో సీపీఎం ఆధ్వర్యంలో సుందరయ్యకు నివాళులర్పించారు. పలు మండలాల్లో సీపీఎం, డీవైఎ్‌ఫఐ నాయకులు పేదలకు పండ్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2021-05-20T06:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising