ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు

ABN, First Publish Date - 2021-12-30T06:38:52+05:30

విద్యార్థుల సమయానుగుణంగా బస్సులను ఏర్పా టు చేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని రామపురం గ్రామంలోని బస్టాండ్‌ సమీపంలో భువనగిరి-గజ్వేల్‌ రహదారిపై మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు బుధవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమయానుగుణంగా బస్సులు నడపాలి

తుర్కపల్లి, డిసెంబరు 29: విద్యార్థుల సమయానుగుణంగా బస్సులను ఏర్పా టు చేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని రామపురం గ్రామంలోని బస్టాండ్‌ సమీపంలో భువనగిరి-గజ్వేల్‌ రహదారిపై మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు బుధవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం పాఠశాల ముగియగానే అరకిలో మీటరు దూరంలో ఉన్న రామపురం బస్టాండ్‌ వద్దకు ఖాళీ నడకన వచ్చి బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  లాక్‌డౌనకు ముందు ఏ విధంగా నైతే బస్సులు నడిపించారో ఇప్పుడు కూడ  అదేవిధంగా బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. విద్యార్థులు రోడ్డుపై గంట సేపు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్ఢుకిరుపుల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంబించింది. పోలీసుల జోక్యంతో విద్యార్థులు రాస్తారోకోను విరమించారు.

Updated Date - 2021-12-30T06:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising