ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : భగత

ABN, First Publish Date - 2021-06-18T06:54:58+05:30

వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే నోముల భగత హెచ్చరించారు.

ఆస్పత్రిలో రిజిస్టర్‌ తనిఖీ చేస్తున్న ఎమ్మేల్యే నోముల భగత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌, జూన 17 : వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే నోముల భగత హెచ్చరించారు. గురువారం ఆయన ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఉదయం 9గంటలకు సైతం డాక్టర్లు రాకపోవడం ఏమిటని సీఎంవోను ప్రశ్నించారు. అంతేగాకుండా మే నెలలో ఉదయం 8గంటలకు అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పైలాన కాలనీకి చెందిన మహబూబ్‌ అలీ మరణించిన సంఘటనపై సెక్యూరిటీ డోర్లు ఎందుకు ఓపెన చేయలేదని, డ్యూటీ డాక్టర్లు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బ ందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎంవోను ప్రశ్నించా రు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వై ద్యం అందించాలన్నారు. సిబ్బంది అంతా సకాలంలో విధులకు హా జరై సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన రఘువీర్‌, కౌన్సిలర్లు మంగ్త, రమే్‌షజీ, ఇందిర, రామకృష్ణ, ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ భానుప్రసాద్‌నాయక్‌, వైద్యులు చక్రవర్తి, నాయకులు బ్రహ్మరెడ్డి, శరతరెడ్డి, మోహన, విక్రం పాల్గొన్నారు.
ఆస్పత్రికి రూ. 7.25లక్షలతో నూతన జనరేటర్‌
 ఏరియా ఆసుపత్రిలో  నెల రోజులుగా జనరేటర్‌ లేక విద్యుత అంతరాయం ఏర్పడినపుడు రోగులు ఇబ్బందులు పడుతున్నారని సీఎంవో భానుప్రసాద్‌నాయక్‌ ఎమ్మెల్యే నోముల భగత దృష్టికి తీసుకెళ్లగా 10రోజుల్లో రూ.7.25లక్షల వ్యయంతో నూతన జనరేటర్‌ను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఆస్పత్రికి ఏమైనా అవసరమైతే తన దృష్టికి తెస్తే   సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


Updated Date - 2021-06-18T06:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising